ఆసియా ఖండంలోనేఅతి పెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రి తిరుపతిలోని బర్డ్స్ హాస్పటల్. పోలియో రోగులకు, ప్రమాదాల బారిన పడ్డ యాత్రికులకు సత్వర చికిత్స అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డది ఈ ఆసుపత్రి.
20 ఎకరాల విస్తీర్ణంలో 520 మంది సిబ్బంది, 29 మంది ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సా నిపుణులు, 10 మంది అనస్ధీయా వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ వైద్యం మరియు భోజనం పూర్తిగా ఉచితం. తెల్లకార్డు ఉన్నవారికి ఖర్చులేకుండా కార్పోరేట్ వైద్యం అందిస్తారు.
50 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఈ ఆసుపత్రికి ప్రత్యేకం. శస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాల ఏర్పాటు, ఫిజియోధెరపీ అన్నీ ఇక్కడే.
పక్కకు తొలగినడిస్క్ లను సరిచేయటం, వంకరగా ఉన్న వెన్నుముకను సరి చేయటం వంగిపోయిన మోకాళ్లను సరిచేయటం మొదలగునవి చేస్తారు. కానీ రోగుల తాకిడి ఎక్కువగా ఉండటం వలన కీళ్లమార్పిడికి చాలాకాలం వేచిఉండాల్సి వస్తుంది.
SVIMS Campus, Nursing College Rd
Sri Padmavati Mahila Visvavidyalayam
Tirupati, Andhra Pradesh 517507
Phone: 0877 226 4619